NTR బయోపిక్ – ట్రైలర్ రివ్యూ

Friday,December 21,2018 - 08:03 by Z_CLU

NTR బయోపిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ గా 2 భాగాలుగా రిలీజవుతున్న ఈ బయోపిక్ లోని కీ ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేస్తూ, 3 నిమిషాల 15 సెకన్ల నిడివితో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఆ రామారావేంటి.? కృష్ణుడేంటి..?’ అంటూ బిగిన్ అయ్యే ట్రైలర్ ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుండి మహానటుడిగా ఎదిగిన NTR కృషిని ఎలివేట్ చేస్తుంది. ఆ తరవాత ఆయన యాక్టింగ్ కరియర్ కోసం ఉద్యోగం వదిలేయడం లాంటి ఎలిమెంట్స్ ని బట్టి, ‘కథానాయకుడు’ లో దర్శకుడు, కామన్ మ్యాన్ కి పెద్దగా పరిచయం లేని NTR పర్సనల్ లైఫ్ ని ప్రెజెంట్ చేస్తున్నాడని తెలుస్తుంది.

‘జనం కోసమే సినిమా అనుకున్నాను, ఆ జనానికి సినిమా అడ్డనుకుంటే సినిమాలు కూడా వదిలేస్తాను’ అనే డైలాగ్ తో ఆయనకు తెలుగు ప్రజల పట్ల అభిమానం తెలుస్తుంది. అల్టిమేట్ గా NTR ఫ్యాన్స్ లో ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గలేదు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. బాలకృష్ణ దగ్గరి నుండి బిగిన్ అయితే సినిమాలోని ప్రతి ఒక్కరు ఆయా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారనిపిస్తుంది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ బయోపిక్. ‘కథానాయకుడు’ జనవరి 9 న రిలీజైతే, ఫిబ్రవరి 7 న ‘మహానాయకుడు’ రిలీజవుతుంది. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి  సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ కంపోజర్.