''ఎన్టీఆర్'' టైటిల్ కాస్త మారింది

Thursday,October 04,2018 - 10:57 by Z_CLU

మొన్నటివరకు ఈ బయోపిక్ పేరు NTR మాత్రమే. కానీ ఇప్పుడీ టైటిల్ కు చిన్న మార్పు చేశారు. ఎన్టీఆర్ టైటిల్ కింద కథానాయకుడు అనే మరో సబ్-టైటిల్ ను చేర్చారు. దీంతో ఇప్పుడీ సినిమా ”ఎన్టీఆర్-కథానాయకుడు”గా మారింది.

టైటిల్ లోగోతో పాటు మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. వింటేజ్ ఎన్టీఆర్ ను ప్రతిబింబించేలా బాలయ్య కొత్త స్టిల్ ను విడుదల చేశారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ నటించిన బందిపోటు సినిమాలో గెటప్ లా ఉంది ఈ నయా లుక్.

సినిమాలో అటుఇటుగా 60 గెటప్స్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. అందులో ఇదొక గెటప్ అన్నమాట. ఇప్పటికే ఎన్టీఆర్ కు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ తో కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. తాజా స్టిల్ ను వింటేజ్ ఎన్టీఆర్ గా చెప్పుకోవచ్చు.

క్రిష్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నారు. ఇందులో ఏఎన్నార్ గా సుమంత్, చంద్రబాబులా రానా, హరికృష్ణగా కల్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.