60 కోట్ల బడ్జెట్ తో NTR బయోపిక్

Monday,February 05,2018 - 01:03 by Z_CLU

NTR బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. స్పెషల్ హాలీవుడ్ టీమ్ పని చేస్తున్న ఈ సినిమాలో 72రకాల  క్యారెక్టర్స్ కి స్కెచ్ వర్క్ నడుస్తుంది. దానికి తోడు NTR లైఫ్ లో అతి సన్నిహితంగా గడిపిన 125 మందిని ఇంటర్వ్యూ చేసి, NTR లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ని కలెక్ట్ చేసిన రీసర్చ్ టీమ్, ఇప్పుడా ఇన్ఫర్మేషన్ ని స్క్రిప్ట్ గా ట్రాన్స్ ఫామ్ చేసే ప్లాన్ లో ఉంది.

60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR లైఫ్ లోని 4 స్టేజెస్ ని అద్భుతంగా ఆవిష్కరించనుంది తేజ టీమ్. అయితే బాలయ్య మాత్రం  ఈ సినిమాలో కేవలం ఒక్క స్టేజ్ లో మాత్రమే NTR లా కనిపించనున్నాడు. NTR పసితనం నుండి బిగిన్ కానున్న ఈ కథలో మొదటి 3 స్టేజెస్ లో నటించనున్న ఆర్టిస్టులను ఇంకా ఫైనల్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

 

ఈ సినిమాలో దాదాపు 60 గెటప్పులలో కనిపించనున్న బాలయ్య, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని విష్ణు ఇందూరి తో పాటు సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ ఈ సినిమాకి డైరెక్టర్.