ఎన్టీఆర్ బయోపిక్ : జయసుధగా పాయల్

Sunday,November 25,2018 - 12:18 by Z_CLU

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి మరో అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో ఇప్పటికే బాలయ్య సరసన విద్యాబాలన్, రకుల్, నిత్యా మీనన్, హీరోయిన్స్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా ఈ లిస్టు లో మరో హీరోయిన్ కూడా చేరింది. ఇటివలే ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును ఎట్రాక్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. బాలయ్య సరసన జయసుధ పాత్రలో పాయల్ కనిపించనుంది.

ప్రస్తుతం బాలయ్య -పాయల్ పై కొన్ని సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తికాగానే జయసుధ పాత్రలో పాయల్ లుక్ ని రివీల్ చేయనున్నారు మేకర్స్. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.