సుయోధనుడి గెటప్ లో బాలయ్య విశ్వరూపం

Thursday,March 29,2018 - 11:15 by Z_CLU

నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన సినిమాల్లో దానవీరశూరకర్ణ ఒకటి. ఈ సినిమాలో సుయోధనుడి పాత్ర, ఆ లుక్ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆ గెటప్ పైనే ఫస్ట్ షాట్ తీశారు. దుర్యోధనుడి గెటప్ లో బాలయ్య నడిచి వస్తుంటే.. అంతా ఎన్టీఆర్ ను మరోసారి నటసింహంలో చూసుకున్నారు.

హైదరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోస్ లో ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దానవీరశూరకర్ణ సినిమాలోని ఓ ఐకానిక్ సీన్ ను ఫస్ట్ షాట్ గా చిత్రీకరించారు. ఈ ఓపెనింగ్ కు చాలామంది సెలబ్రిటీస్ తో పాటు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు.

బాలయ్య బయోపిక్ కు కీరవాణి సంగీతం అందించనున్నాడు. బుర్రా సాయిమాధవ్ మాటలు సమకూర్చనున్నాడు. సంతోష్ కుండియిల్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. రంగస్థలం సెట్ తో గుర్తింపుతెచ్చుకున్న రామకృష్ణ-మౌనిక ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ చేయబోతున్నారు. తేజ దర్శకత్వంలో రాబోతోంది ఈ బయోపిక్.

మూవీకి సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ వర్క్ పూర్తయింది. కుబుసం సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డా.ఎల్ శ్రీనాధ్, మరో నిర్మాత విష్ణువర్థన్ ఇందూరితో కలిసి ఈ సినిమాకు కథ అందించారు.