'ఎన్టీఆర్' బయోపిక్ - అసలు కథ వేరు

Sunday,December 09,2018 - 11:02 by Z_CLU

నందమూరి నటసింహం బాలకృష్ణ -క్రిష్ కాంబినేషన్ లో నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమా 7 రోజుల మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. ముందుగా ఈ సినిమాను ఒకే పార్ట్ గా తెరకెక్కించాలనుకున్న సంగతి తెలిసిందే.

అయితే రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందట. ఈ సినిమాను ముందుగా  4 గంటల నిడివితో ఒకే సినిమాగా తెరకెక్కించి మధ్యలో రెండు ఇంటర్వెల్స్ ప్లాన్ చేసారట మేకర్స్. అయితే దీనికి మల్టీ ప్లెక్సుల యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఆ ఆలోచనను విరమించుకొని రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. అలా రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక్కో పార్ట్ దాదాపు మూడు గంటల నిడివి ఉండేలా చూసుకున్నారట. సో ‘NTR’ రెండు భాగాలు కలిపి దాదాపు 6 గంటల నిడివి ఉండబోతుందన్నమాట.

 

ప్రస్తుతం ‘మహానాయకుడు’ పార్ట్ కి సంబంధించి ఓ వారం పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది.. ‘NTRకథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుండగా ‘NTR మహానాయకుడు’ ఫిబ్రవరి మొదటి వారంలో థియేటర్స్ లోకి రానుంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.