బాలయ్య ఎన్టీఆర్ బయో పిక్ అప్ డేట్స్

Sunday,January 14,2018 - 01:23 by Z_CLU

ప్రస్తుతం ‘జై సింహ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఇటివలే ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తి చేశారు యూనిట్. టీజర్ కోసం షూట్ చేసిన  ఈ షెడ్యుల్ లో బాలయ్య పై అలాగే  హరికృష్ణ మనవళ్ల పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. కళ్యాణ్ రామ్ తనయుడు ఈ సినిమాలో స్వర్గీయ ఎన్.టి.రామారావు చిన్నప్పటి రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. జనవరి ఎండింగ్ లో ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ దాదాపు 62 గెటప్స్ లో కనిపించనున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబందించి భారీ షెడ్యుల్ ప్రారంభం కానుంది.