గ్రాండ్ గా NTR బయోపిక్ ఆడియో లాంచ్

Tuesday,December 18,2018 - 07:17 by Z_CLU

NTR బయోపిక్ చుట్టూ ఫ్యాన్స్ లో చాలా క్యూరియాసిటీ ఉంది. దానికి తగ్గట్టే సినిమా స్టాండర్డ్స్ ఎలివేట్ అయ్యేలా ఎప్పటికప్పుడు స్టిల్స్ ని రిలీజ్ చేస్తూ, సినిమా ప్రోగ్రెస్ ని ఆడియెన్స్ కి రివీల్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు అదే వరసలో డిసెంబర్ 21 న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ సినిమా ఆడియోని లాంచ్ చేయనున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన 2 సాంగ్స్ ఫ్యాన్స్ ని టోటల్ గా మెస్మరైజ్ చేశాయి. అందుకే ఈ సినిమా జ్యూక్ బాక్స్ పై భారీ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు ఇదే ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తుండటంతో, ఫిల్మ్ మేకర్స్ ఫస్ట్ టైమ్ ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్న ఈ విజువల్స్ లో ఏం ప్రెజెంట్ చేస్తారా..? అనే ఆతృత ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది NTR బయోపిక్. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ బయోపిక్ లోని ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ అవుతుంది. ఇక సెకండ్ పార్ట్  ‘మహా నాయకుడు’ ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాని బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.