NTR బయోపిక్ – గ్రాండ్ గా ఈవెంట్స్

Thursday,December 13,2018 - 10:02 by Z_CLU

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది NTR బయోపిక్. 2 భాగాలుగా రిలీజవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్స్ ఇప్పటికే ఫిక్సయ్యాయి. మరో వారం రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనున్న మేకర్స్, ఈ లోపు సినిమా ప్రమోషన్ ప్రాసెస్ ని కూడా డిజైన్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 16 న హైదరాబాద్ లో  గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకోనున్న మేకర్స్, 21 న NTR స్వస్థలం నిమ్మకూరులో, గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేయనున్నారు.

డిసెంబర్ 16 న రానున్న ఈ ట్రైలర్ లో ఏయే అంశాల్ని మెన్షన్ చేయబోతున్నారు మేకర్స్…? ఈ బయోపిక్ 2 భాగాలుగా రిలీజవుతుంది కాబట్టి, మేకర్స్ ఈ ట్రైలర్ లో NTR ని కథా నాయకుడిగా ఎలివేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారా..? లేక మహా నాయకుడిగా ప్రెజెంట్ చేయబోతున్నారా..? ఈ ట్రైలర్ లో హైలెట్ కాబోయే ఎలిమెంట్ ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్, ఈ బయోపిక్ కి కీరవాణి పర్ఫెక్ట్ చాయిస్ అనిపించేంతలా మెస్మరైజ్ చేస్తున్నాయి. అందుకే ఈ సినిమా జ్యూక్ బాక్స్ పై కూడా భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ‘కథానాయకుడు’ గా జనవరి 9 న రిలీజవుతుంది. ‘మహానాయకుడు’ ని మ్యాగ్జిమం ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.