ఫ్యామిలీ సాంగ్ తో సెట్స్ పైకి వచ్చిన NTR

Tuesday,September 04,2018 - 06:47 by Z_CLU

హరికృష్ణ హఠాన్మరణం తరవాత నిన్న ‘అరవింద సమేత’ సెట్స్ పైకి వచ్చేశాడు NTR. దాంతో సినిమా టీమ్ మొత్తం ఒక్కసారిగా ఇమోషనల్ అయింది. మరీ ముఖ్యంగా ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా NTR డెడికేషన్ కి అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, సినిమాలో హెవీ ఇంపాక్ట్ చూపించే ఫ్యామిలీ సాంగ్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా కూడా ఉంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.