సాయి ధరం తేజ్ సినిమాకి NTR క్లాప్

Monday,January 30,2017 - 08:00 by Z_CLU

సాయి ధరం తేజ్ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేశాడు. ఇందులో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ సినిమాకి NTR క్లాప్ కొట్టాడు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి జవాన్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు.

గతంలో నానితో క్రిష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నటించిన మెహరీన్ కౌర్ ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన జత కట్టనుంది.ఈ సినిమాతో ఇప్పటి వరకు రచయితగా మంచి సక్సెస్ రేషియో మెయిన్ టైన్ చేస్తున్న B.V.S. రవి ఈ సినిమాతో డైరెక్టర్ గా తన లక్ ని చెక్ చేసుకోబోతున్నాడు.

రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్, కృష్ణ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.