మరికొన్ని గంటల్లో ‘అరవిందసమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,October 02,2018 - 10:31 by Z_CLU

టాలీవుడ్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ NTR ‘అరవిందసమేత’ పై ఫిక్సయి ఉంది. బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఆల్బమ్, అరవింద సమేతపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసింది. అయితే ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో NTR స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ లో అప్పుడే కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది.

NTR, త్రివిక్రమ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమా చుట్టూ న్యాచురల్ గానే భారీ క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉంది. అయితే ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ జెనెరేట్ అయ్యేలా, సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను రివీల్ చేయనున్నారు అరవింద సమేత టీమ్.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది.