గ్రాండ్ గా NTR అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,September 27,2018 - 03:04 by Z_CLU

NTR అరవింద సమేత ప్రమోషన్స్ మరింత స్పీడందుకానున్నాయి. ఇప్పటికే  ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా మామూలుగా లేదు. ఆల్రెడీ ఈ సినిమాపై ఉన్న పెక్టేషన్స్ ని మరింతగా రేజ్ చేశాయి ఈ సాంగ్స్. అయితే ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని ఫిక్సయిన మేకర్స్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 2 న, నోవాటెల్  హోటల్, హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయనున్నారు.

NTR స్టైల్ లో ఫాస్ట్ పేజ్ లో సినిమాని తెరకెక్కించేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకోనున్నారు. అందుకే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ఈ ఈవెంట్ పై ఫిక్సయి ఉంది. యాక్షన్ తో పాటు మోస్ట్ ఇంటెన్సివ్ ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘అరవింద సమేత’  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

త్రివిక్రమ్ ఈ సినిమాకి డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. NTR సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘అరవింద సమేత’ దసరాకి రిలీజవుతుంది.