అరవింద సమేత ‘పెనివిటి’ సాంగ్ – అదిరిపోయిన లిరిక్స్

Wednesday,September 19,2018 - 05:21 by Z_CLU

అరవింద సమేత నుండి సెకండ్ సింగిల్ రిలీజయింది. రీసెంట్ గా సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్, ఈ రోజు సినిమాలో సిచ్యువేషనల్ గా ఉండబోయే ‘పెనివిటి’ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గురించే. సాంగ్ ట్యూన్ ని కూడా డామినేట్ చేస్తూ, మోస్ట్ ఇంటెన్సివ్ మోడ్ లో ఉన్న లిరిక్స్, సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తున్నాయి. దానికి కాళభైరవ వాయిస్ పాటకి మరింత లైఫ్ ని ఆడ్ చేస్తుంది.

అరవింద సమేత స్టోరీలైన్ ఏంటనేది ఇంత వరకు బయటికి రాలేదు కానీ, జనం కోసం ఫ్యామిలీని కూడా వదిలేసి వెళ్ళిపోయిన భర్త కోసం ఎదురు చూసే భార్య పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది. దానికి తోడు సాంగ్ బిగినింగ్ లో ఉన్న కాన్వర్జేషన్ ని బట్టి, అది హీరో పేరెంట్స్ అని అర్థమవుతుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుందీ అరవింద సమేత. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్.