గ్రాండ్ గా రిలీజైన NTR అరవింద సమేత

Thursday,October 11,2018 - 11:03 by Z_CLU

గ్రాండ్ గా రిలీజయింది NTR అరవింద సమేత. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన ఈ యాక్షన్, ఇమోషనల్ ఎంటర్ టైనర్ అంచనాలకు మించి ఎంటర్ టైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న పాజిటివ్ చూస్తుంటే, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

NTR త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే క్రియేట్ అయిన వైబ్స్, ఫస్ట్ షో తోనే హిట్ టాక్ గా ట్రాన్స్ ఫామ్ అవుతున్నాయి. ఫస్టాఫ్ లో మ్యాగ్జిమం యూత్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ చేసిన దర్శకుడు, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో, అంతే ఈజ్ తో సినిమా మెయిన్ స్టోరీలోకి క్యారెక్టర్స్ ని ట్రావెల్ చేయించిన విధానం అద్భుతం అంటూ క్రిటిక్స్ చేత కూడా ప్రశంసలు అందుకుంటున్న అరవింద సమేత ఫస్ట్ షో కే సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది.

మరీ ముఖ్యంగా NTR క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన విధానం, సినిమాకి ప్రాణం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలొచ్చినా ఈ సినిమాలో సీమ సొగసును చూస్తారు అని త్రివిక్రమ్ అన్న మాట స్క్రీన్ పై  100% ఎలివేట్ అవుతుంది.