'అరవింద సమేత' ఫస్ట్ లుక్ ... హాట్ టాపిక్ గా మారిన టైటిల్

Saturday,May 19,2018 - 05:20 by Z_CLU

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. తారక్ ను సిక్స్ ప్యాక్ లుక్ తో పవర్ ఫుల్ గా చూపించే స్టిల్ తో ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు… ఉదయం నుండే ఈ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాకు సంబంధించి మరికొన్ని టైటిల్స్ పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ను ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ తో NTR కి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్ గా మరింది..  ఇంతకీ ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్ లోనే ఉంటుందా..? లేదా గతంలో NTR మాస్ సినిమాలా ఉంటుందా..? అనే డౌట్ క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాస్ & క్లాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందీ సినిమా. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.