అరవింద సమేత అకౌంట్ లో మరో రికార్డ్

Monday,October 22,2018 - 02:48 by Z_CLU

బ్లాక్ బస్టర్ మూవీ ‘అరవింద సమేత’ అకౌంట్ లో మరో రికార్డు చేరింది. లేటెస్ట్ గా 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా U.S. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ లిస్టులో స్థానం సంపాదించుకుంది.

ప్రీమియర్ షో నుండే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను కలెక్ట్ చేసుకున్న అరవింద సమేత, 2 వారాలు కూడా పూర్తి చేసుకోకముందే U.S. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో 10 వ స్థానంలో నిలిచింది.

NTR కరియర్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తరవాత అంతే ఫాస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన సినిమా అరవింద సమేత. ప్రస్తుతం 2.8 $ మిలియన్ కలెక్షన్స్ తో 10 వ స్థానంలో నిలిచిన ఈ సినిమా నెక్స్ట్ వీకెండ్ నాటికి మరిన్ని రికార్డ్స్ కొల్లగొట్టే చాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

బాహుబలి 2 – $20 మిలియన్

బాహుబలి – $6.99 మిలియన్
రంగస్థలం  – $3.51 మిలియన్
భరత్ అనే నేను – $3.46 మిలియన్

శ్రీమంతుడు – $2.89 మిలియన్
మహానటి  – $2.54 మిలియన్
గీతగోవిందం  – $2.46 మిలియన్
అ..ఆ – $2.45 మిలియన్

ఖైదీ నం150 – $2.44 మిలియన్

అరవింద సమేత – 2.08 మిలియన్