రూమర్లకు చెక్.. 20న ఆడియో

Wednesday,September 12,2018 - 06:05 by Z_CLU

మొన్నటి వరకు ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు. ఒకే ఒక్క పోస్టర్ తో అన్నింటికీ చెక్ పడింది. అరవింద సమేత ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 20న అరవింద సమేత ఆడియోను విడుదల చేయబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

 ప్రస్తుతం ‘అరవింద సమేత’ యూనిట్ మొత్తం షూటింగ్ హడావుడిలో ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.  20వ తేదిన   పాటలు మార్కెట్ లోకి రాబోతున్నాయి.

త్రివిక్రమ్-తారక్ ఫ్రెష్ కాంబోలో తెరకెక్కుతోంది అరవింద సమేత. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ట్రమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆడియో రిలీజ్ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫస్ట్ లుక్ గా కత్తిపట్టిన ఎగ్రెసివ్ ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్, తాజాగా కూల్ గా కనిపించే ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేసి సినిమాపై అంచనాల్ని, క్యూరియాసిటీని మరింత పెంచాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.