అరవింద సమేత ఆడియో రివ్యూ

Thursday,September 20,2018 - 05:40 by Z_CLU

ముందే అనౌన్స్ చేసినట్టు ‘అరవింద సమేత’ ఆడియో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్ లో సందర్భానుసారంగా ఉండబోయే 4 పాటలు ఉన్నాయి. అయితే వీటిలో 2 పాటల్ని ముందే రిలీజ్  చేసేసిన  మేకర్స్,  ఇప్పుడీ జ్యూక్ బాక్స్ లో మరో 2 పాటల్ని చేర్చారు.

ఏడ పోయినాడో :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పెంచల్ దాస్ కలిసి లిరిక్స్ రాసిన సాంగ్ ఇది. సినిమాలో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గెస్ చేయడం కష్టమే కానీ, సినిమాలో ఇంపార్టెంట్ స్పేస్ లో ఉండబోయే క్యారెక్టర్ ని ఉద్దేశించి, ‘ఏడ పోయినాడో…’ అంటూ సాగే పాట ఇది. సినిమా కంప్లీట్ గా యాక్షన్ మోడ్ లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యే సందర్భంలో ఉండబోయే సాంగ్ అని తెలుస్తుంది. నిఖిత శ్రీవల్లి, కైలాష్ ఖేర్, పెంచల్ దాస్ ఈ పాటని పాడారు.

అనగనగా : ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సాంగ్ ఇదే. సినిమా ఎప్పు డెప్పుడు రిలీజవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం  ట్రీట్ లా రిలీజైన ఈ  సాంగ్,  సినిమాలోని  రొమాంటిక్   ఆంగిల్  ని ఎలివేట్  చేస్తుంది. సీతారామ  శాస్త్రి   రాసిన ఈ  పాటని  అర్మాన్  మాలిక్  పాడాడు.

పెనివిటి సాంగ్నిన్ననే సోషల్ మీడియాలో రిలీజైంది ఈ సాంగ్. ఇమోషనల్ ఉండే ఈ సాంగ్ లిరిక్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని రేజ్ చేస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసిన ఈ పాటని కాళభైరవ పాడాడు. ఈ సాంగ్ లిరిక్స్ ని బట్టి ఈ సినిమా స్టోరీలైన్ పై సోషల్ మీడియాలో డిఫెరెంట్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

రెడ్డి ఇక్కడ సూడు : NTR ఫ్యాన్స్ ని మైండ్ లో పెట్టుకుని మరీ ప్లాన్ చేసుకున్న సాంగ్. మాస్ బీట్స్ తో ఎనర్జిటిక్ స్టెప్స్ పడేలా కంపోజ్ అయిన ఈ సాంగ్  ఆడియో  కన్నా విజువల్ గా అదిరిపోతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఓవరాల్ గా సినిమాలో సందర్భానుసారంగా కంపోజ్ అయిన ఈ 4 పాటల్లో ‘ఏడ పోయినాడో’ తో పాటు ‘పెనివిటి’ సాంగ్, సినిమాలోని ఇమోషనల్ స్పేస్ ని ఎలివేట్ చేస్తే, తక్కిన 2 సాంగ్స్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కమర్షియల్ ఆంగిల్ ని హైలెట్ చేస్తున్నాయి.  ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.