ఇక పై కూడా అలాంటి పాత్రలే....

Tuesday,January 24,2017 - 07:46 by Z_CLU

మొన్నటి వరకూ కమర్షియల్ కథలనే నమ్ముకొని ఆ సినిమాలతో ఎంటర్టైన్ చేయాలనుకున్న ఎన్టీఆర్ తన పంథాను మార్చుకొని నటుడిగా సరి కొత్త క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఇలా సరి కొత్త క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన తనకు ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ వంటి గ్రాండ్ హిట్స్ అందించారని ఆ హిట్స్ తనకు మరింత ఉత్సాహాన్ని అందించాయని ఇటీవలే ఓ మ్యాగ్జీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఇక తన నెక్స్ట్ సినిమాలో కూడా అలాంటి సరి కొత్త క్యారెక్టర్స్ తోనే ఎంటర్టైన్ చేయనున్నట్లు,    అలాగే  ఆడియన్స్ లో వస్తున్న మార్పును బట్టీ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటానని తెలిపిన తారక్  తన సినిమాలు అపజయాలు అందుకున్నప్పుడు పెద్దగా పట్టించుకోనని ఆ మూడ్ నుంచి త్వరగా బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని, ఫ్రీ టైం లో కుకింగ్ చేస్తుంటాని, కుకింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు .