ఎన్టీఆర్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే...

Saturday,March 04,2017 - 04:30 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ సినిమా ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.. బాబీ దర్శకత్వం లో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి తాజాగా పూర్తి చేశారట యూనిట్ .. ప్రెజెంట్ తారక్ తన మేకోవర్ కి కాస్త టైం తీసుకుంటుండడంతో ఈ షెడ్యూల్ లో కొందరు నటులపై కొన్ని కామెడీ సీక్వెన్స్ తో పాటు మరికొన్ని సీన్స్ ను చిత్రీకరించారని సమాచారం..

తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ రేపటి నుంచి రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయబోతున్నారని  సమాచారం .. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తన డిఫరెంట్ మేకోవర్ తో  9 నుంచి సెట్ లో అడుగు పెట్టబోతున్నాడట.. ప్రస్తుతం ఇంకో నాలుగు రోజుల పాటు ఇతర నటులపై కొన్ని సీన్స్ తెరకెక్కించి మార్చ్ 9నుంచి తారక్ తో సన్నివేశాలను షూట్ చేస్తారట…..