ఫాస్ట్ పేజ్ లో NTR 27

Thursday,February 09,2017 - 02:50 by Z_CLU

జనతా గ్యారేజ్ తరవాత ఆచి తూచి మరీ బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు NTR. 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ చేయనున్న NTR 27 సినిమా యూనిట్, సెట్స్ పైకి రావడానికి కావాల్సిన సరంజామా మొత్తం సర్దుకునే పనిలో పడింది. రేపు గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాని NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

రాక్ స్టార్ DSP ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ ని ఫైనల్ చేసేసిన NTR 27 టీం, ఫాస్ట్ పేజ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ ని కంప్లేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకోసం NTR సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్. అందునా 3 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు డెఫ్ఫినేట్ గా క్యారెక్టర్, క్యారెక్టర్ కి మధ్య డిఫెరెన్స్ ఉండాలి. కాబట్టి బాబీ సినిమాని సెట్స్ పైకి తీసుకు రాకముందే NTR లుక్స్ పై భారీ కసరత్తు చేశాడనే సమాచారం.