NTR 27 లాంచ్ అయింది

Friday,February 10,2017 - 12:28 by Z_CLU

జనతా గ్యారేజ్ తరవాత బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న నెక్స్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ రోజు లాంచ్ అయింది. NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుండి ఫుల్ ఫ్లెజ్డ్ గా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్న NTR సరసన రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా ఫిక్సయింది. ఇంకా తక్కిన స్టార్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ntr27-launched-zee-cinemalu

రొటీన్ సినిమాలకు భిన్నంగా ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయిన NTR, ఈ సినిమా కోసం గత 2 మంత్స్ గా  మేకోవర్ చేస్తున్నట్టు సమాచారం. తను చేయనున్న 3 క్యారెక్టర్స్ లలో సిక్స్ ప్యాక్ తో ఒక క్యారెక్టర్ లో కనిపిస్తే, మరో క్యారెక్టర్ కోసం వెయిట్ పెరగనున్నాడట యంగ్ టైగర్.