రకుల్ అలా ఫిక్స్ అయ్యింది

Thursday,September 14,2017 - 12:40 by Z_CLU

టాలీవుడ్ లో వరుస బడా సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్దింది. మహేష్ సరసన ‘స్పైడర్’ లో నటించిన ఈ భామ ఈ సినిమాతో సెప్టెంబర్ 27 నుంచి తెలుగు, తమిళ్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండడంతో తను నటిస్తున్న తమిళ్, హిందీ సినిమాల పై ఫోకస్ పెట్టింది.

తమిళ్ లో కార్తీ సరసన ‘తీరం అథికారమ్ ఒండ్రు’ అనే సినిమాతో పాటు హిందీ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన ఓ సినిమాలో నటిస్తున్న రకుల్.. ఈ రెండు సినిమాలతో అక్కడ కూడా సత్తా చాటాలని చూస్తుంది. స్పైడర్ తో ఎలాగూ తమిళ్, తెలుగులో గ్రాండ్ హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉంది రకుల్. ఎటొచ్చి బాలీవుడ్ లో చేస్తున్న సినిమాపైనే కాస్త టెన్షన్ తో ఉంది. ప్రస్తుతం చేస్తున్న హిందీ మూవీ కూడా హిట్ అయితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్ హీరోయిన్ అనిపించుకుంటుంది రకుల్.