అందరి చూపు రోబో-2 పైనే

Monday,July 25,2016 - 02:53 by Z_CLU

 

కబాలి సినిమాకు ఓవర్సీస్ లో తప్ప మిగతా అన్ని దేశాలు, ప్రాంతాల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ విషయంలో అభిమానులు కూసింత నిరుత్సాహానికి గురైనప్పటికీ… రజనీకాంత్ అమెరికా నుంచి ఇఁడియాకు తిరిగిరావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. పనిలోపనిగా తలైవ అభిమానులంతా ఇప్పుడు కబాలి గురించి మాట్లాడుకోవడం మానేశారు. రజనీ చెన్నై వచ్చాడు కాబట్టి… రోబో 2.0 షూటింగ్ ను ఎప్పుడు మొదలుపెడతాడా అని అంతా డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు.
శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రజనీకాంత్ రోబో 2.0 షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతదేశ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే రజనీకాంత్ కబాలికి షిఫ్ట్ అవ్వడం… ఆరోగ్యం కూడా బాగాలేదని వార్తలు రావడం జరిగిపోయాయి. దీంతో రోబో 2.0 సినిమాపై అనుమానాలు పెరిగిపోయాయి. ఎట్టకేలకు రజనీకాంత్ తిరిగి చెన్నై రావడంతో రోబో 2.0 తిరిగి సెట్స్ పైకి వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు.
రజని, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘శివాజీ’,’రోబో’ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే మూడో సినిమా ‘2.0’ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు రజనీ ఫాన్స్. తాజా సమాచారం ప్రకారం… వచ్చేనెల మొదటి వారంలో రోబో 2.0 కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.