ఇక తగ్గించేస్తానంటున్న సమంత..

Saturday,September 17,2016 - 11:30 by Z_CLU

‘ఏ మాయ చేసావే’ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోలతో నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కథానాయికగా వెలుగుతున్న సమంత తాజాగా ఓ కామెంట్ చేసింది. అయితే ఇటీవలే ఈ చెన్నై ముద్దుగుమ్మ అక్కినేని యువ హీరో నాగ చైతన్య ను పెళ్లి చేసుకో బోతుందని అందుకే బడా సినిమాలు సైతం వదులుకుంటోందనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

      ఈ అమ్మడు ఈరోజు చేసిన ట్వీట్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. తనకి చాలా సినిమాలు ఒప్పుకోవాలనున్నా.. తనకు తగిన పాత్ర.. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే సరైన పాత్ర దక్కడం లేదంటూ, సౌత్ సినిమాలలో హీరోయిన్స్ కు ఇలాంటి పాత్రలు దక్కడం చాలా కష్టమంటూ తనలోని బాధ ను వ్యక్తం చేసింది..
ఇలా ప్రాధాన్యమైన పాత్ర కోసం చెప్పుకొచ్చిన సమంత ఇక పై సినిమాలు మరింత తగ్గించేస్తుందేమో చూడాలి..