నోటా ప్రీ-లుక్: ఎగ్రెసివ్ దేవరకొండ

Wednesday,September 05,2018 - 05:21 by Z_CLU

పెళ్లిచూపుల్లో పక్కింటి దేవరకొండను చూశాం. అర్జున్ రెడ్డి సినిమాలో రెబల్ దేవరకొండను చూశాం. ఇక రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ గీతగోవిందంలో డీసెంట్ దేవరకొండను చూశాం. త్వరలోనే ఈ హీరోను మరో కొత్త గెటప్ లో చూడబోతున్నాం. అవును.. నోటాలో లీడర్ గా కనిపించబోతున్నాడు విజయ్

నోటా సినిమాకు సంబంధించి రేపు సాయంత్రం 4 గంటలకు ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందు ప్రీ-లుక్ రిలీజైంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది. నోటా ప్రీ-లుక్ లో మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు.

ప్రీ-లుక్ కూడా భలే గమ్మత్తుగా కట్ చేసి వదిలారు. చివర్లో దేవరకొండ సరిగ్గా డైలాగ్ చెప్పే టైమ్ కు ఈ క్లిప్ కట్ అయింది. ఆ డైలాగ్ ను రేపు రిలీజ్ కాబోతున్న ట్రయిలర్ లో కంటిన్యూ చేస్తారేమో చూడాలి.

స్టుడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.