కామెడీ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే కూడా

Thursday,November 02,2017 - 06:41 by Z_CLU

ఆది సాయికుమార్ హీరోగా నటించిన సినిమా నెక్ట్స్ నువ్వే. హారర్-కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హారర్-కామెడీ అనగానే అంతా కేవలం కామెడీ యాంగిల్ లోనే సినిమాను చూస్తున్నారు. అయితే నెక్ట్స్ నువ్వే సినిమాలో అంతకుమించి ఉంటుందంటున్నాడు నాని. కామెడీతో పాటు పక్కా స్క్రీన్ ప్లే కనిపిస్తుందని చెబుతున్నాడు.

“హారర్-కామెడీ జానర్ సినిమా అంటూ రొటీన్ గా ఫీలయ్యే వాళ్ళని ఈ సినిమా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. ఒక్కసారి సినిమాకు కనెక్ట్ అయితే ఆడియన్స్ రొటీన్ ఫీలవ్వరు. మూవీలో లీనమైపోతారు. అలా కనెక్ట్ అయ్యే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చాలా ఉంది.” ఇలా తన సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ఆది సాయికుమార్.

పేరుకు రీమేక్ అయినప్పటికీ మూవీలో చాలా మార్పులుంటాయని, ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లు “నెక్ట్స్ నువ్వే” చూస్తే ఆ మార్పుల్ని ఈజీగా గుర్తుపడతారని అంటున్నాడు ఆది.