దిల్ రాజు, క్రిష్ కాంబోలో సినిమా

Saturday,October 19,2019 - 04:18 by Z_CLU

ఇది దిల్ రాజు బ్యానర్ లో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాదు. దిల్ రాజు, క్రిష్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో వ‌స్తే నిర్మాత‌గా త‌న వంతు స‌హకారం అందించి నిర్మాణంలో భాగ‌స్వామి కావడానికి తాను సిద్ధ‌మ‌ని దిల్‌రాజు ఈమధ్య తెలిపాడు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా తొలి అడుగు ప‌డింది. దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` అనే సినిమా రూపొంద‌నుంది.

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ అనే కొత్త వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా స్టార్ట్ చేశారు. ఈ మూవీకి నూటొక్క జిల్లాల అందగాడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ (చి.ల‌.సౌ ఫేమ్‌) హీరోహీరోయిన్లు.

రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది.