Theaters Re-Open - తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు?

Thursday,October 15,2020 - 01:47 by Z_CLU

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా థియేటర్స్ తెరుచుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో ఈరోజు పదిహేను రాష్ట్రాల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా సినిమా హాళ్ళు తెరవని పరిస్థితి. ఒక వైపు భారీ వర్షాలు , అలాగే ప్రభుత్వం నుండి థియేటర్స్ యాజమాన్యం కోరుతున్న కరెంట్ బిల్స్ సబ్సిడీ పై క్లారిటీ రాకపోవడంతో ఈరోజు ఏపీ, తెలంగాణలో థియేటర్స్ రీ ఓపెన్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ విషయంపై ఎగ్జిబిటర్స్ ప్రభుత్వం మధ్య చర్చలు నడుస్తున్నాయి.

అయితే ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేస్తే ఏ సినిమాలు ప్రదర్శిస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ లో తెరిచిన థియేటర్స్ లో నేటి నుండి లాక్ డౌన్ కి ముందు ప్రదర్శించిన సినిమాలు వేస్తున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెర్చుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా నుండి కొన్ని పాత సినిమాలతో ప్రభుత్వం ఆదేశించిన జాగ్రత్తలతో థియేటర్స్ తెరుచుకునే అవకాశం ఉంది. ఇక దీపావళి నుండి థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేసే చాన్స్ కనిపిస్తుంది.