RRR అప్ డేట్.. ఎన్టీఆర్ టీజర్ లేదు

Monday,May 18,2020 - 02:01 by Z_CLU

ఇంకో రెండు రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తోంది.. ఇప్పటి నుండే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో పుట్టిన రోజు హంగామా మొదలెట్టేసారు కూడా. ప్రస్తుతం తారక్ నటిస్తున్న ‘RRR’ నుండి బర్త్ డే టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చేసింది RRR టీం.

లాక్ డౌన్ మళ్ళీ పొడిగించిన కారణంగా RRR నుంచి తారక్ వీడియో రిలీజ్ చేయట్లేదని ఎనౌన్స్ చేసింది యూనిట్. టీజర్ కు సంబంధించి షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

టీజర్ లేకపోయినా కనీసం ఫస్ట్ లుక్ పోస్టరైనా ఉంటుందనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.  ప్రామిస్ చేశాం కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి రిలీజ్ చేయాలని అనుకోవడం లేదని, అందరి ఎదురుచూపులు ఫలించేలా అద్భుతంగా టీజర్ ఉంటుందని స్పష్టంచేసింది.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేసింది RRR యూనిట్. తారక్ పుట్టినరోజుకు కూడా అదే స్థాయిలో అదిరిపోయే టీజర్ రిలీజ్ చేయాలనుకుంది. కానీ లాక్ డౌన్ కారణంగా పనులు జరగకపోవడంతో టీజర్ రిలీజ్ ను వాయిదా వేసింది.