కోలీవుడ్ లో మజిలీ రీమేక్... నిజమెంత?

Tuesday,April 23,2019 - 01:54 by Z_CLU

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మజిలీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారట. ఈ రీమేక్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు రూమర్లు కూడా వచ్చాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మజిలీ రీమేక్ రైట్స్ ను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదని ప్రకటించారు

కోలీవుడ్ లో ధనుష్ హీరోగా ఈ సినిమా రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. స్వయంగా ధనుష్ రంగంలోకి దిగి, తన సొంత బ్యానర్ వండర్ బార్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా రైట్స్ తీసుకున్నాడంటూ పుకార్లు వచ్చాయి. అలాంటిదేం లేదని యూనిట్ స్పష్టంచేసింది.

నాగచైతన్య-సమంత కాంబోలో తెరకెక్కిన మజిలీ సినిమాకు శివనిర్వాణ దర్శకుడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ఆల్రెడీ 3 వారాలు అవుతోంది. అయినప్పటికీ మూవీకి ఏపీ, నైజాంలో డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి.