Shriya - ఎన్టీఆర్-చరణ్ తో నాకు లింక్ లేదు

Sunday,September 13,2020 - 10:15 by Z_CLU

రాజమౌళి తీస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీ RRR లో శ్రియ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అజయ్ దేవగన్ పాత్రకు భార్యగా Shriya కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఆమె గతంలోనే వెల్లడించింది. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ బయటపెట్టింది.

RRR లో శ్రియ పాత్ర కేవలం అజయ్ దేవగన్ కు మాత్రమే పరిమితం అంట. సినిమాలో Shriya-AjayDevgan మధ్య మాత్రమే సన్నివేశాలు కనిపిస్తాయట. ఈ విషయాన్ని శ్రియ బయటపెట్టింది. ఎన్టీఆర్-చరణ్ తో తన పాత్రకు ఎలాంటి లింక్ ఉండదని.. వాళ్లతో ఎలాంటి కాంబినేషన్ సీన్లు లేవని క్లారిటీ ఇచ్చింది.

కరోనా/లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన RRR ను తిరిగి సెట్స్ పైకి తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

NTR-RamCharan హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్. కీరవాణి సంగీత దర్శకుడు.