KRACK OTT రిలీజ్... క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Friday,August 14,2020 - 01:12 by Z_CLU

ప్రెజెంట్ కొన్ని సినిమాలు డైరెక్ట్ OTT లో రిలీజ్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు. డైరెక్ట్ OTT Release లిస్టులో రవితేజ ‘క్రాక్’ ను కూడా చేర్చారు. సినిమాకు సంబంధించి ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఇది థియేటర్ రిలీజ్ ఉండదంటూ కొందరు పోస్టులు వేస్తుండటంతో ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.

Krack Theater Release Only … అంటూ సోషల్ మీడియా వేదికగా ‘క్రాక్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. దీంతో OTT రిలీజ్ లిస్టులో నుంచి క్రాక్ తప్పుకుంది. అయితే నాని ‘V’, అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమాల విషయంలోనూ ఇదే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సినిమాల విషయంలో మాత్రం మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వార్తలను ఇప్పటి వరకు ఆ టీం నుండి ఎవరూ ఖండించలేదు.