నాని-సమంత కాంబినేషన్ లో సినిమా?

Tuesday,November 05,2019 - 01:34 by Z_CLU

గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారట. అది కూడా ఎమోషనల్ మూవీస్ డైరక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందట. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న ఈ స్టోరీపై సదరు డైరక్టర్ క్లారిటీ ఇచ్చాడు.

నాని-సమంత హీరోహీరోయిన్లుగా సినిమా చేయబోతున్నట్టు వచ్చిన గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదంటున్నాడు శివ నిర్వాణ. సినిమా ఓకే అయితే తనే స్వయంగా ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ గాసిప్ కు చెక్ పడింది.

నిజానికి శివ నిర్వాణ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా కన్ ఫర్మ్ చేశాడు. పూరితో చేయాల్సిన ఫైటర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే శివ నిర్వాణ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

ఇలాంటి టైమ్ లో నాని హీరోగా తన దర్శకత్వంలో సినిమా అంటూ గాసిప్స్ రావడంతో వెంటనే అలెర్ట్ అయ్యాడు శివ నిర్వాణ. అలాంటి ప్రాజెక్టు లేదని క్లారిటీ ఇచ్చాడు.