నో మోర్ హెబ్బా

Thursday,March 02,2017 - 10:01 by Z_CLU

ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ లవర్ బాయ్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయినా, అల్టిమేట్ కమర్షియల్ హీరో అనిపించుకుంది మాత్రం కుమారి 21F తోనే… తెలుగు సినిమా స్క్రీన్ పై హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ అంత ఈజీగా తగ్గలేదు.

కుమారి 21F తరవాత మళ్ళీ ఆడోరకం ఈడోరకం సినిమాలో హెబ్బాతో జోడి కట్టిన రాజ్ తరుణ్, అదే సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీ ని అనిల్ సుంకర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అందగాడు’ లోను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకో నాలుగు పాటలు మినహా మ్యాగ్జిమం టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ మరో కమర్షియల్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది.

 

ప్రస్తుతం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న రాజ్ తరుణ్ తో.. ఫ్యూచర్ లో హెబ్బా తో మరిన్ని సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని అడిగిన క్వశ్చన్ కి నవ్వుతూనే సమాధానం చెప్పాడు రాజ్ తరుణ్. ‘ఇక చాలు… నో మోర్ హెబ్బా… రీసెంట్ గానే అందగాడు సెట్స్ పై హెబ్బా నేను ఈ విషయంలో ఆల్ రెడీ ఫిక్స్ అయిపోయాం…’. అని చాలా జోవియల్ గా చెప్పుకున్నాడు.