ఇక ఆడియో ఫంక్షన్లు లేనట్టే

Friday,November 11,2016 - 10:06 by Z_CLU

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసుకుంటూ పోయే టాలీవుడ్ లో ఇంకో పెద్ద చేంజ్ చోటు చేసుకుంటుంది. సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకుండానే అట్టహాసంగా జరిగే ఆడియో ఫంక్షన్స్ కి ఇక శుభం కార్డు పడినట్టేనేమో అనిపిస్తుంది.

కారణాలు సరిగ్గా తెలీదు కానీ అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘సరైనోడు’ ఆడియో ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. దానికి బదులు సినిమా రిలీజ్ కి దగ్గరగా ఉందనగా, ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. సినిమా కలెక్షన్స్ రికార్డులు బద్దలు చేశాయి.

ఈ కాన్సెప్టేదో వర్కవుట్ అయ్యేలా ఉందనుకున్నారేమో…  రామ్ చరణ్ ధృవ కి కూడా సేం టు సేం కాన్సెప్ట్. నో ఆడియో ఫంక్షన్. డైరెక్ట్ గా పాటల్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేసేశారు. ఇంకా వెన్యూ ప్రకించలేదు కానీ… సరైనోడు టైపులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం పక్కా… ఇవేనా..? చివరికి దెయ్యం కూడా ఇదే రూట్లో నడిచింది…. అదే అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం’ ఆడియో కూడా ఆన్ లైన్ లోనే రిలీజయింది. వీటితో పాటు నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’  ఆడియో ఈ రోజు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.