అందుకే సినిమాల్లేవ్...

Wednesday,October 19,2016 - 06:33 by Z_CLU

రవితేజ ఏడాది నుంచి సినిమా ఒప్పుకోవడం లేదు. ఏ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది సెట్స్ పైకి రావట్లేదు. తెరవెనక కొన్ని కారణాల వల్ల  సినిమాలు ఆగిపోతున్నాయని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దర్శకుడు పూరి జగన్నాధ్ మరో వెర్షన్ వినిపిస్తున్నాడు. పూరి చెప్పేదేంటంటే… రవితేజకు ఇప్పుడు మూడ్ లేదట.

      అవును… 15-16 ఏళ్లుగా ఎడతెరిపి లేకుండా సినిమాలు చేస్తున్న మాస్ రాజాకు ఒక్కసారిగా బోర్ కొట్టేసిందట.  అందుకే ఏ సినిమా ఒప్పుకోకుండా గ్యాప్ తీసుకున్నాడట. ఈ గ్యాప్ లో కుదిరితే దేశాలన్నీ చుట్టేయాలని ఫిక్స్ అయిపోయాడట రవితేజ. ఇప్పటికే దేశ పర్యటన కూడా షురూ చేశాడట. పూరీ జగన్నాధ్ ను కూడా కొన్నాళ్లు సినిమాలు ఆపేసి తనతో రమ్మనమని కోరాడట. రవితేజ సినిమాలు చేయకపోవడానికి ఇదే కారణం అంటున్నాడు దర్శకుడు పూరి.