ఇకపై దర్శకత్వం చేయను

Monday,May 08,2017 - 11:01 by Z_CLU

కళాతపస్వి, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాద్ దర్శకత్వ విభాగం నుంచి తప్పుకున్నారు. ఇకపై తన దర్శకత్వంలో సినిమాను ఆశించవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తిచేశారు విశ్వనాధ్. “బహుశా నా డైరక్షన్ లో ఇకపై సినిమా రాకపోవచ్చు. ప్రేక్షకులు నన్ను చాలా గౌరవించారు. నాపై ఎనలేని ప్రేమ కురిపించారు. దర్శకత్వం నుంచి నేను గౌరవప్రదంగా తప్పుకుంటున్నాను” అని విశ్వనాథ్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

కొన్ని రోజుల కిందట రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న కె.విశ్వనాథ్.. దర్శకత్వ శాఖ నుంచి తప్పుకున్నప్పటికీ సినీరంగంలో మాత్రం కొనసాగుతానని ప్రకటించారు. తన మనసుకు నచ్చిన పాత్రలు వస్తే నటించడానికి ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు.

శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శృతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, శుభసంకల్పం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు విశ్వనాథ్. వీటిలో కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. తెలుగుదనం, సంస్కృతి, కళల్ని తన సినిమాల ద్వారా దేశవ్యాప్తం చేశారు విశ్వనాథ్.