Theaters Unlock - బొమ్మ పడేదెప్పుడు?

Tuesday,September 22,2020 - 03:21 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్ ఒక్కొక్కటిగా మళ్ళీ సెట్స్ పైకి వస్తున్నాయి. షూటింగ్స్ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు OTT లో రిలీజవుతుంటే మరికొన్ని థియేటర్స్ తెరుచుకొనే రోజు కోసం ఎదురుచూస్తున్నాయి.

వచ్చే నెల నుండి థియేటర్స్ ఓపెన్ అంటూ ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడే సినిమా హాళ్ళు ఓపెన్ కావని ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయని, ఈ సమయంలో థియేటర్స్ ఓపెన్ అయితే Covid19 ఇంకా విజృంభిస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

అయితే దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ మాత్రం కేంద్రం నుండి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ విడుదల చేసే ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

మరి సినిమా థియేటర్స్ గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు సినిమా రిలీజ్ లపై క్లారిటీ రాదు.