Radheshyam ఫ్యాన్స్ వెయిటింగ్ !

Monday,February 01,2021 - 04:07 by Z_CLU

ఈ ఏడాది రిలీజవుతున్న అందరు స్టార్ హీరోల సినిమాలపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ , సూపర్ స్టార్ , స్టైలిష్ స్టార్ ఇలా అందరి సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ అయ్యాయి. కానీ రాధాకృష్ణ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్‘ సినిమాకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఇంత వరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఈ మధ్యే షూటింగ్ మొదలుపెట్టిన ‘సర్కారు వారి పాట’,’F3′ సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. కానీ ఎప్పుడో షూటింగ్ మొదలైన ‘రాధేశ్యామ్’ విడుదల విషయంపై మాత్రం ఇంకా ఫ్యాన్స్ కి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వెయిట్ చేయిస్తున్నారు మేకర్స్.

 మిగతా హీరోల సినిమాలు డేట్ లాక్ చేసేసుకొని ఖర్చీపులేసుకుంటుంటే తమ హీరో సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియక సతమవుతున్నారు రెబల్ ఫ్యాన్స్. నిజానికి జనవరిలోనే సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్లాన్ మార్చి టీజర్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ తో అప్డేట్ ఇచ్చి టీజర్ లో అఫీషియల్ గా సినిమా రిలీజ్ డేట్ చెప్పబోతున్నారని సమాచారం. మరి ప్రభాస్ టీజర్ తో వచ్చే వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.

Also Check ‘రాధే శ్యామ్’ కోసం రెండు కోట్లు