పవన్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో ?

Sunday,December 17,2017 - 04:06 by Z_CLU

పవన్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ చేయబోయే సినిమాపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఓ వైపు ఈ సినిమా రిలీజ్ మూడ్ ని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు పవన్ నెక్స్ట్ సినిమా ఎవరితో..ఉంటుందా అంటూ  వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

ఇటీవలే నేసన్ అనే తమిళ దర్శకుడితో ‘వేదలమ్’ రీమేక్ ను లాంచ్ చేసిన పవన్ ఆ సినిమా పై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పవన్ ఈ సినిమా చేయకపోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఇక సంతోష్ శ్రీనివాస్ తో పవన్ నెక్స్ట్ సినిమా ఉంటుందనే టాక్ కూడా టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది.. అయితే పవన్ మాత్రం ఎలాంటి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా నెక్స్ట్ సినిమాను వెయిటింగ్ మోడ్ లో పెట్టాడు. మరి ‘అజ్ఞాతవాసి’ రిలీజ్ తర్వాతైనా పవన్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇస్తాడా…చూడాలి.