SANKRANTHI Movies - సంక్రాంతి సినిమాలపై క్లారిటీ లేదు

Thursday,September 16,2021 - 03:55 by Z_CLU

అదేంటి? వచ్చే సంక్రాంతి కి థియేటర్స్ లో రాబోయే సినిమాలు ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు కదా మళ్ళీ క్లారిటీ ఏంటి ? అనుకుంటున్నారా ? అవునండీ సంక్రాంతి సినిమాల రిలీజ్ పై ఇంకా డిస్కషన్ నడుస్తుంది. దీనికి రీజన్ RRR. అవును అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ అవ్వాలి. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ కొంత కారణం అయితే ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మార్కెట్ ఓపెన్ అవ్వకపోవడం మెయిన్ రీజన్. అందుకే సైలెంట్ గా సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్.

RRR movie working stills zeecinemalu

ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అక్టోబర్ కల్లా మొదటి కాపీ రెడీ అవుతుందని క్లారిటీ ఇస్తూ వరల్డ్ వైడ్ గా సినిమా మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు RRR ని రిలీజ్ చేస్తాం అంటూ చెప్పారు. కానీ కొత్త రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. గత కొన్ని రోజులుగా RRR సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

pawan kalyan Bheemla Nayak movie stills

ఇప్పటికే ఎనౌన్స్ చేసిన సంక్రాంతి సినిమాల నిర్మాతలతో RRR మేకర్స్ చర్చిస్తున్నారని సమాచారం. కానీ రాధేశ్యామ్ తో పాటు భీమ్లా నాయక్ మేకర్స్ కూడా వాయిదా వేసుకోవడానికి ఒప్పుకోలేదని టాక్. ఇక చేసేదేం లేక రాజమౌళి , దానయ్య సినిమాను వచ్చే సంక్రాంతి కి వారం ముందే అంటే జనవరి 8న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇక తాజాగా మరో డేట్ కూడా చెక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ లో కూడా ఒక డేట్ అనుకుంటున్నారట మేకర్స్. సో RRR రిలీజ్ పై క్లారిటీ వచ్చే దాక సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics