ఇంకా నో  క్లారిటీ...  

Saturday,October 29,2016 - 01:31 by Z_CLU

 ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై.. రెండే సినిమాకే మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన ముకుంద భామ పూజ హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్ ‘డి.జె’ లో ఛాన్స్ కొట్టేసిందనే వార్త వినిపించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం మరికొందరు హీరోయిన్స్ పేర్లు పరిశీలించినప్పటికీ… యూనిట్ మాత్రం ఫైనల్ గా పూజానే కథానాయికగా ఫిక్స్ చేసారని టాక్.

అయితే  ప్రస్తుతం ఈ వార్త నిజం కాదనే టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ పూజ పేరు అనౌన్స్ చేయకపోవడమే.  ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనా…. టీం ఇంకా పూజాను సంప్రదించలేదనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.  మరి ఈ భామ డీజేకు ఫిక్స్ అయ్యిందా? లేక యూనిట్ మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. అన్నట్టు బన్నీ కూడా ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు.