'ఆచార్య' ప్లానింగ్ ప్రకారమే !

Wednesday,March 04,2020 - 05:58 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ముందుగా అనుకున్న డేట్ కే సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 14 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

అయితే సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి రీజన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఓ కీ రోల్ చేయనుండటం. అవును మహేష్ రాకతో షూటింగ్ డేస్  పెరగనున్నాయని, అందువల్ల సినిమా పోస్ట్ పోన్ అవ్వనుందనే  టాక్ స్ప్రెడ్ అవుతుంది. కానీ మేకర్స్ మాత్రం క్లారిటీతో అనుకున్న డేట్ కే సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట.

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి , రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.