చెప్పిన టైమ్ కే వస్తున్న సూపర్ స్టార్

Sunday,August 20,2017 - 03:30 by Z_CLU

వచ్చే ఏడాది జనవరి 25న 2.0 సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని నిర్థారించారు. 2.0 రిలీజ్ ను ఎట్టిపరిస్థితుల్లో చెప్పిన టైమ్ కు తీసుకొస్తామని, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని.. లైకా ప్రొడక్షన్స్ కు చెందిన రాజు మహాలింగం ప్రకటించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది. ఈమధ్యే తాజాగా రిలీజ్ డేట్ ను విడుదల చేశారు. అయితే ఆ టైమ్ కు కూడా సినిమా రాదంటూ కథనాలు రావడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎలర్ట్ అయింది. చెప్పిన టైమ్ కు చెప్పినట్టు వస్తామని ప్రకటించింది.

భారతీయ సినీచరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది 2.0 చిత్రం. గతంలో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ మూవీ. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీత దర్శకుడు.