నో బ్రేక్ అంటున్న మహేష్ బాబు

Friday,September 01,2017 - 11:57 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ నిన్నటితో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరో వైపు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆల్ రెడీ 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే రొమేనియా నుండి ఈ రోజు ఇండియాకి వస్తున్న మహేష్ బాబు ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా రేపటి నుండి కొరటాల సినిమా సెట్స్ పైకి వచ్చే సూచనలు  కనిపిస్తున్నాయి.

D.V. V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.