చరణ్ సినిమాకు ఆడియో ఫంక్షన్ లేదు

Thursday,November 03,2016 - 04:36 by Z_CLU

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ధృవ. ఈ సినిమాకు హిపాప్ ఆది సంగీతం అందిస్తున్నాడు. ఈ పాటలు ఎప్పుడు విడుదలవుతాాయాా.. ఎప్పుడు ఆడియో ఫంక్షన్ పెడతారా… అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అంతా అనుకుంటున్నట్టు ధృవ సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ లేదు. అవును.. ఈ సినిమా పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 9న ధృవ సాంగ్స్ నేరుగా మార్కెట్లోకి రాబోతున్నాయి.

dhruva-final

అయితే ఆడియో ఫంక్షన్ కు బదులుగా… ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీగా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. గతంలో సరైనోడు సినిమాకు కూడా నిర్మాత అల్లు అరవింద్ ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. పాటల్ని నేరుగాా మార్కెట్లోకి విడుదలచేసి, విశాఖలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. దానికి చిరంజీవి గెస్ట్ గా కూడా హాజరయ్యారు. ఇప్పుడు ధృవ విషయంలో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ధృవ సినిమా థియేటర్లలోకి వస్తుంది.