నో అండ్ నెవర్

Tuesday,November 15,2016 - 10:30 by Z_CLU

హండ్రెడ్ పర్సెంట్ వర్క్ మైండెడ్, పర్సనల్ విషయాల్లో చాలా ప్రైవేట్ గా ఉండే తమన్నా, ప్రొఫెషనల్ లైఫ్ లోను చిన్న గాసిప్ కి కూడా గ్యాప్ ఇవ్వదు. అలాంటిది ఎక్కడ మొదలైందో తెలీదు కానీ, తమన్నా ఒక కమెడియన్ సినిమాలో హీరోయిన్ గా చేయనుందని రూమర్ క్రియేట్ అయింది.

కాస్త ట్రెండింగ్ లో ఉన్న స్టార్స్ విషయంలో ఇలాంటివి చాలా కామనే అయినా, తమన్నా మాత్రం దాన్ని బిగినింగ్ లోనే కట్ చేసేసింది. నా సినిమాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, నేనే షేర్ చేసుకుంటాను. దయచేసి ఇలాంటివి క్రియేట్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి అని ఖరాకండి గా చెప్పేసింది.

ప్రస్తుతం బాహుబలి 2, ఒక్కడొచ్చాడు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసుకుని కాస్త బ్రేక్ తీసుకున్న తమన్నా, త్వరలో మరో సినిమాకు సంతకం చేసే ప్లాన్ లో ఉంది.