F3 Movie - మరో క్లారిటీ వచ్చేసింది

Friday,December 18,2020 - 10:22 by Z_CLU

F2లో ఇద్దరు హీరోలున్నారు. ఇప్పుడు F3 వస్తోంది. కాబట్టి ముగ్గురు హీరోలు ఉంటారంటూ ఓ కొత్త ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. అంతేకాదు, ఈ లిస్ట్ లో రవితేజ లాంటి హీరోల పేర్లు కూడా చేర్చి కథలు అల్లేశారు. ఇప్పుడీ మేటర్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు Anil Ravipudi.

F3 Movie లో కూడా ఇద్దరే హీరోలు ఉంటారని తేల్చేశాడు రావిపూడి. సీక్వెల్ లో VenkateshVarunTej మాత్రమే ఉంటారని.. మూడో హీరోకు చోటు లేదని క్లియర్ గా చెప్పేశాడు.

ఈనెల 23 నుంచి F3 Movie సెట్స్ పైకి రాబోతోంది. మొదటి షెడ్యూల్ లోనే వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ సీన్లు సెట్ చేశారు. తమన్న, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Check – ప్లాన్ మార్చిన రావిపూడి